ప్రత్యేక అధికారి వెంకటేశం
నవతెలంగాణ – నసురుల్లాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం నిరుపేదలకు ఓ వరం లాంటిదని, ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని నసురుల్లాబాద్ మండల ప్రత్యేక అధికారి వెంకటేశం లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. అలాగే గ్రామంలోని పలు వార్డులను, ప్రకృతి వనంను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి వెంకటేశం మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పథకంలో భాగంగా రూ. 5 లక్షలతో నిర్మించనున్న ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని సూచించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామ పరిశుభ్రతలలో గ్రామస్తుల సమాచారం ఉండాలని గ్రామం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నెలకొన్న పలు సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. పల్లె ప్రకృతి వనం ను గ్రామస్తులు వయంలోకి వచ్చేలా చూడాలన్నారు. వీరి వెంట మండల ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్, గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి బలరాం సింగ్, ఉపాధి హామీ అధికారులు, గ్రామ కార్యదర్శి సుధాకర్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



