ఎన్నికలప్పుడే రాజకీయాలు…ఇప్పుడు అభివృద్ధే లక్ష్యం :
ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ అనుమతులు ఇస్తే, రాష్ట్ర ఆదాయం పెంచి, కేంద్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనిలో సీఎం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ తొలుత జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధే ప్రాధాన్యమనీ, ఆ తర్వాతే రాజకీయ పార్టీలు అని స్పష్టంచేశారు. ఆ స్ఫూర్తితోనే దేశ నిర్మాణం కోసం ప్రధాని వికసిత్ భారత్-2047 కటించగానే, తాముకూడా దానిలో భాగస్వాములమై, తెలంగాణ రైజింగ్-2047కు రూపకల్పన చేశామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అనీ, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పైనే దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధానిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సహకారంతో గుజరాత్ మోడల్‌ను అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు కూడా వచ్చే పదేండ్లలో కేంద్రంనుంచి ఆ తరహా సహకారాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. 2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లుకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దానికోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే మహా నగరాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. దానికోసం దేశంలోని ఆరు మెట్రో నగరాలకు సంబంధించి జాతీయ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం నుంచి త్వరితంగా అనుమతులు లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవం, రెండోదశ మెట్రో రైలు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారి వంటి పలు ప్రాజెక్టులను ప్రస్తావించారు.
అనుమతులివ్వండి…ఆదాయం పెంచుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



