- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని SFI, DYFI, AIDWAలు డిమాండ్ డిమాండ్. బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రి పదవీ నుంచి బర్తరప్ చేయాలని, మైనర్ బాలికకు తగిన రక్షణ కల్పించాలన్నాయి. బాధితులకు అండగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి.
- Advertisement -



