- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. సోమవారం విడుదలైన ఈ ట్రైలర్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఓ ముఖ్యమైన సందేహానికి తెరపడింది. గత రెండు భాగాల్లా కాకుండా, ఈసారి వెంకటేష్‌తో రీమేక్ ఉండదని, మలయాళ వెర్షన్‌నే తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారని స్పష్టమైంది. మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా మే 21న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
- Advertisement -



