- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సంగారం గ్రామంలో గురువారం తాత్కాలిక గ్రామ పంచాయతీ భవనంను సంగారం సర్పంచి ఈసం రమేష్, పెద్దవూర సర్పంచి ఐతబోయిన వెంకటయ్య గౌడ్, ఉపసర్పంచి, వార్డు మెంబర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పంచాయితీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయితీలలో నీటి సరఫరా గురుంచి, కరెంటు సమస్యల గురించి, వార్డు సభ్యులకు సలహాలు, సూచనలు చేశారు. గ్రామ ప్రజలకుగ్రామ పంచాయతీ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా సూసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చూసుకుంటానని సర్పంచి ఈసం రమేష్ తెలిపారు.
- Advertisement -



