- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం సమీపంలో గురువారం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ జి. నరేందర్ రోడ్డు భద్రత భద్రతా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, హెల్మెట్ ధరించడం, వాహనాలను నిబంధనల ప్రకారం నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వేగ నియంత్రణ పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



