నవతెలంగాణ – మునుగోడు
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు దంత సమస్యలను పరిష్కరించేందుకు నార్కట్పల్లి కామినేని డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో శిబిరమును ఏర్పాటు చేసి ఉచత దంత పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడపూర్ వెంకటనారాయణ అన్నారు. గురువారం మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కామినేని డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత దంత శిబిరాన్ని ఏర్పాటు చేసి పాఠశాలలోని విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి దంత సమస్యలు ఉన్నవారికి నార్కట్పల్లి కామినేని ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందించేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మాజీ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్, గ్రామ ప్రజలు మక్కెన అప్పారావు, బోయపర్తి సంజీవ, చింతల శ్రీను, కామినేని డెంటల్ హాస్పిటల్ వైద్యులు, ఉపాధ్యాయుల బృందం తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ బడిలో డెంటల్ శిబిరం ఏర్పాటు అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



