నవతెలంగాణ – ఆలేరు రూరల్
క్రీడలతో మానసిక ఉల్లాసం,శారీరక దృఢత్వం పెంపొందుతాయని ఆలేరు ఎస్‌హెచ్ఓ యాలాద్రి అన్నారు. ఆలేరు మండలం శారాజీపేట గ్రామ సర్పంచ్, ఆలేరు మండల పోరం అధ్యక్షులు కంతి మధు, జి హెచ్ ఎం సి స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ అడ్వైజర్ ఐల కొమురయ్య కలిపి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ను చిలుకు ఫౌండేషన్ సామాజిక సేవా సమితి ఆధ్వర్యంలో,చిలుకు యాదగిరి జ్ఞాపకార్థం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహిస్తూ యువతను సరైన మార్గంలో నడిపిస్తున్న చిలుకు ఫౌండేషన్ సేవలు,ఆలోచనలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకు ఫౌండేషన్ చైర్మన్ చిలుకు నిరోషా స్వామి, ఉపసర్పంచ్ శ్రీధర్, ఎస్ఐ వినయ్, రచ్చ రాంనర్సయ్య, డైరెక్టర్ చిలుకు కిష్టయ్య, కంతి మహేందర్ నాగరాజు, అడ్వకేట్ ఐల కొమురయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బండ మహేందర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు, కేమిడి ఉప్పలయ్య, పాత్రికేయులు ఎండీ ఖుర్షిద్, మంత్రి సన్నీ తదితరులు పాల్గొన్నారు.



