Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనారోగ్య విద్యార్థి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేత

అనారోగ్య విద్యార్థి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలంలోని  గ్రామానికి చెందిన రత్తిపల్లి గ్రామానికి చెందిన రడం నర్సింగ్ రావు కుమారుడు మణికుమార్ అనారోగ్యానికి గురై శాస్త్ర చికిత్స చేసుకొని విశ్రాంతి తీసుకుంటున్న విద్యార్థికి గురువారం విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ చైర్మన్ బోల్గురి ముకేష్ విద్యార్థిని పరామర్శించి కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ముకేష్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న విద్యార్థులను ఆదుకోవడంమే తమ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం అని అన్నారు. చదువుకునే పిల్లలు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సాయం అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు రాకేష్, ట్రెజరర్ జగదీశ్, సభ్యులు గాదె రాజు, బొడ్డుపల్లి రాజు, గ్రామ 7వ వార్డ్ మెంబర్ బోల్గురి ఉపేదర్, మహేందర్ , గాదె శివరాజ్ తదితరులు ఉన్నారు . 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -