- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని మండల అగ్నిమాపక అధికారి బి. శ్రీనివాస్ సూచించారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి ప్రయివేట్ పాఠశాలలో విద్యార్థులకు అగ్ని నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ప్రమాద సమయంలో ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కోరారు. సిలిండర్ నుంచి ఆకస్మికంగా అగ్ని జ్వాలలు తడి బొంతతో కానీ, దట్టమైన దళసరి గుడ్డతో కానీ దాన్ని కప్పి వేయాలన్నారు..మంటలు చెలరేగుతున్నప్పుడు నీరు పోయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కస్తూరి సతీశ్, అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



