- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సికాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పాఠశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను ప్రతిబింబించేలా విద్యార్థుల యొక్క వ్యక్తిగత ఫోటోలతో క్యాలెండర్లను మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీన్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా ఆధ్వర్యంలో గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు మహేష్ తన తనయుని పుట్టినరోజు సందర్భంగా క్యాలెండర్లకు కావలసిన ఆర్థిక సహాయం చేసి విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు టి.తిరుపతి, సదానందం, అరుణ్ కుమార్, సురేష్, సిఆర్పీ సమత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -



