నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ప్రభుత్వ ఫ్లాట్లు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు గురువారం తాసిల్దార్ స్వప్నకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తిరుపతయ్య గ్రామస్తులు, ప్లాట్లు లబ్ధిదారులు మాట్లాడుతూ.. కొత్తపల్లి గ్రామ శివారులోని సర్వేనెంబర్ 36/2 లో మూడు ఎకరాల 22 గుంటల ప్రభుత్వ భూమిలో 1997 సంవత్సరంలో గ్రామస్తులైన 53 మంది నిరుపేదలకు ప్లాట్లు వేసి పంపిణీ చేసినారు.
ప్రభుత్వానికి ఇచ్చిన భూమిలో రికార్డులో తొలగించలేదు అట్టి భూమిని గుంటుక సైదిరెడ్డి ద్వారా జక్కా బుచ్చయ్య వారి వారసులు 1966లో కొనుగోలు చేసినారు. రికార్డుల నుండి తొలగించినందుకు ప్లాట్లు పొందిన లబ్ధిదారులకు కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కృష్ణయ్య, అంజి , సత్తయ్య, అలివేలు, వెంకటమ్మ, పద్మ, బుచ్చమ్మ, 50 మంది లబ్ధిదారులు ఉన్నారు.



