Wednesday, May 13, 2026
E-PAPER
Homeఆటలుప్లే ఆఫ్స్ కు గుజరాత్

ప్లే ఆఫ్స్ కు గుజరాత్

- Advertisement -

కదం తొక్కిన బౌలర్లు
సన్ రైజర్స్ పై 82 పరుగులు తేడాతో టైటాన్స్ గెలుపు

అహ్మదాబాద్‌ : బౌలర్ల స్వర్గధామం అహ్మదాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అనూహ్యంగా ఓటమిపాలైంది.తొలుత గుజరాత్ టైటాన్స్ ను 168పరుగులకే పరిమితం చేసినా..ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ బౌలర్లు రబడా,హోల్డర్ దెబ్బకు సన్ రైజర్స్ 86పరుగులకే కుప్పకూలింది.దీంతో గుజరాత్ జట్టు 82పరుగుల తేడాతో గెలిచి 16పాయింట్లతో ప్లే-ఆఫ్స్ కు చేరింది. 169 పరుగుల ఛేదనలో భాగంగా సన్ రైజర్స్ టాప్,మిడిల్,లోయర్ ఆర్డర్ బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే ఔటై పెవీలియన్ కు చేరారు.ఓపెనర్లు హెడ్(0),అభిషేక్(6)కి తోడు ఇషాన్(11),రవిచంద్రన్(9),నితీశ్ కుమార్(2)ఇలా వచ్చి అలా వెళ్లారు.సన్ రైజర్స్ జట్టు స్కోర్ 56పరుగులకు చేరేసరికి సగం వికెట్లు కోల్పోయి ఓటమికి రువైంది. రబడా(3/28),హోల్డర్(3/20),ప్రసిధ్(2/23)సన్ రైజర్స్ బ్యాటర్లును కోలుకోలేని దెబ్బ తీసారు. తొలుత సన్ రైజర్స్ బౌలర్లు కమిన్స్,ప్రతుల్ హింగేకి తోడు షకీబ్ హుసైన్ బౌలింగ్ లో రాణించాడు.దీంతో గుజరాత్ నామమాత్రపు స్కోర్ కే పరిమితమైంది.టాస్ ఓడిన గుజరాత్ టైటాన్స్‌ను పవర్ ప్లేలో సన్‌రైజర్స్ పేసర్లు వణికించారు.

ఉప్పల్ హీరో ప్రఫుల్ హింగే(2/17)రెండు వికెట్లతో బ్రేకివ్వగా గుజరాత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా నడిచింది.తొలుత హింగే ఓవర్లో శుభ్‌మన్ గిల్‌(5)మిడ్‌ వికెట్‌లో ఆడిన బంతిని క్లాసెన్ డైవింగ్ క్యాచ్‌ పట్టాడు.ఆపై స్పూప్ షాట్ ఆడాలనుకున్న బట్లర్‌(7)వికెట్ కీపర్ ఇషాన్ చేతికి చిక్కాడు.అనంతరం..నిశాంత్ సింధు(22),ఓపెనర్ సాయి సుదర్శన్(61)కీలక భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశారు.కానీ,ఈసారి కమిన్స్‌,క్లాసెన్ జోడీ సింధును వెనక్కి పంపింది.అంతే.. 64కే మూడు కీలక వికెట్లు పడ్డాయి.ఆ దశలో సుందర్(50)జతగా సుదర్శన్ జట్టును గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడాడు.అర్ధ శతకంతో గుజరాత్‌కు మంచి స్కోరందించాలనుకున్న సుదర్శన్‌ను షకీబ్ వెనక్కి పంపాడు.డెత్ ఓవర్లలో ధాటిగా ఆడిన సుందర్ మలింగ బౌలింగ్‌లో ఫైన్ లెగ్‌లో4, 6 బాదాడు.చివరి ఓవర్లో షకీబ్ 10రన్సే ఇవ్వడం,డెత్ ఓవర్లలో సుందర్ దూకుడుతో నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 168పరుగులకే పరిమితమైంది.సన్ రైజర్స్ బౌలర్లు హింగే,షకీబ్ హుసైన్ కు రెండేసి,కమిన్స్ కు ఒక వికెట్ దక్కాయి.

స్కోర్ బోర్డు…
గుజరాత్ టైటాన్స్ :సాయి సుదర్శన్ (సి)ప్రతుల్ హింజే (బి)షకీబ్ హుసైన్ 61,శుభ్ మన్ గిల్ (సి)క్లాసెన్(బి)ప్రతుల్ హింగే 5,బట్లర్(సి)ఇషాన్ కిషన్ (బి)ప్రతుల్ హింగే 7,నిషాంత్ సింధు (సి)క్లాసెన్(బి)పాట్ కమిన్స్ 22,వాషింగ్టన్ సుందర్ (సి)ఇషాన్ కిషన్ (బి)షకీబ్ హుసైన్ 50,హోల్డర్(నాటౌట్) 11, తెవాటియా(నాటౌట్) 4, అదనం8. (20 ఓవర్లలో5వికెట్ల నష్టానికి) 165 పరుగులు.

వికెట్ల పతనం: 1/15, 2/26, 3/64, 4/124, 5/164
బౌలింగ్ : పాట్ కమిన్స్ 4-0-20-1,నితీశ్ కుమార్ రెడ్డి 3-0-27-0,ప్రతుల్ హింగే 3-0-17-2,ఈషన్ మలింగ 4-0-46-0,షకీబ్ హుసైన్ 4-0-37-2,శివాంగ్ కుమార్ 2-0-19-0

సన్ రైజర్స్ హైదరాబాద్ : హెడ్(సి)నిషాంత్ సింధు (బి)సిరాజ్0,అభిషేక్(బి)రబడా6,ఇషాన్(సి)బట్లర్(బి)రబడా11,రవిచంద్రన్(సి)గిల్(బి)రబడా9,క్లాసెన్(సి)బట్లర్(బి)హోల్డర్14,సలీల్ అరోరా (సి)బట్లర్(బి)ప్రసిధ్16,నితీశ్ కుమార్ (సి)సుందర్(బి)హోల్డర్2,కమిన్స్(సి)సిరాజ్(బి)ప్రసిధ్19,శివాంగ్ కుమార్ (సి)బట్లర్(బి)హోల్డర్4,హింగే(స్టంప్)బట్లర్(బి)రషీద్ ఖాన్ 3,ఈషన్ మలింగ (నాటౌట్) 0, అదనం2. (14.5 ఓవర్లలో ఆలౌట్) 86 పరుగులు.

వికెట్ల పతనం: 1/0, 2/6, 3/23, 4/32, 5/56, 6/56, 7/60, 8/72, 9/82, 10/86
బౌలింగ్ : సిరాజ్3-1-11-1,రబడా4-0-28-3,హోల్డర్4-0-20-3,ప్రసిధ్3-0-23-2,రషీద్ ఖాన్ 0.5-0-3-1.
సాయి సుదర్శన్ , సుందర్ అర్థ శతకాలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -