భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ – భూపాలపల్లి
గ్రామీణ వైద్యులకు అన్నివిధాలా అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. గురువారం ఆర్ఎంపీ,పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ రాంనగర్ లో (ఆర్ఎంపీ,పిఎంపీ వైద్యుల కమ్యూనిటీ హాల్) ప్రజా సౌకర్యాల కేంద్ర భవన నిర్మాణ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామీణ వైద్యులను గుర్తింపు శిక్షణ తరగతులు ప్రారబించిన నేపథ్యంలో దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో శిక్షణ తరగతులు నిలిపోయినట్లుగా తెలిపారు.
తరువాత పదేళ్ల బిఆర్ఎస్ దద్దమ్మల పాలనలో గ్రామీణ వైద్యులను విద్మరించారని మండిపడ్డారని తెలిపారు .ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్రామీణ వైద్యులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.బిఆర్ఎస్,బీజేపీలు రాష్ట్రంలో కనుమరుగైయ్యాయని తెలిపారు. సీఎం నేతృత్వంలోనే రూ.1 కోటి నిధులతో రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ప్రథమంగా కమ్యూనిటీ భవన నిర్మాణ పనుల కోసం భూమి,నిధులు సీఎం ద్వారా మంజూరు చేస్తున్నట్లుగా తెలిపారు. ఆరు నెలల్లోనే భవనం పూర్తియ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం గ్రామీణ వైద్యులపై జరుగుతున్న దాడులని నిలిపివేసినట్లుగా తెలిపారు.ఇందుకు గ్రామీణ వైద్యులు ప్రభుత్వానికి సహకరిస్తూ రానున్న మున్సిపాలిటీ, ఎంపిటిసి,జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేయించాలి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిసిసి అధ్యక్షుడు బట్టు,టీపీసీసీ సభ్యుడు అశోక్,ఆర్ఎంపీ,పిఎంపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు,కోశాధికారి రమేష్,జిల్లా అర్బన్ అధ్యక్షుడు రమేష్,రూరల్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు,ఉపాధ్యక్షులు చింతల కుమార్ యాదవ్,దొడ్ల అశోక్,రఘు,కుమార్,అధికారప్రతినిది రాజేందర్,రాష్ట్ర నాయకులు వెంకన్న,చారి, శ్రీనివాస్,జిల్లా నాయకులు రపి,రమణ,సుధాకర్ఆయా మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు,గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.



