కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్–2 కు ప్రోగ్రాం ఆఫీసర్‌గా పెద్దూరి వెంకటేశ్వర్లు నియామకం అయినట్లు కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ మరియు ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడం, సేవాభావాన్ని అలవరచడం, జాతీయ స్థాయి కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యాన్ని కల్పించడం వంటి లక్ష్యాలతో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు అమలవుతాయని గురువారం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతనంగా నియమితులైన ప్రోగ్రాం ఆఫీసర్ పెద్దూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవా కార్యక్రమాల అమలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను చురుకుగా పాల్గొనేలా కృషి చేస్తానని తెలిపారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ మంజూరు చేసిన యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ లకు ప్రోగ్రాం ఆఫీసర్ పెద్దూరి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఎంపిక చేసినందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆరిగకూటి శ్రీనివాస్ రెడ్డి మరియు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నూతన ప్రోగ్రాం ఆఫీసర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.



