వీకే క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట రౌడీ’. ఇటీవల ఈ చిత్రాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.
మాక్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కళ్యాణి కర్తనాధ నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మాస్, లవ్ ఎంటర్టైనర్పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హీరో చంటి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌ను ఆనంద్ గ్రూప్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఎల్. ఆనంద్ కుమార్ చేతుల మీదగా ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయ్యిందని, త్వరలోనే మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రానికి అదనపు స్క్రీన్‌ప్లే కేవీర్ అందించగా, మాటలు- పాటలు భాష్యశ్రీ రాశారు. సినిమాటోగ్రఫీని వై.ఎస్.కృష్ణ నిర్వహిస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్లుగా ఇటీకర్లపల్లి మహేష్ కుమార్, దంతులూరి పథ్విరాజ్ వ్యవహరిస్తున్నారు. ఫైట్ మాస్టర్‌గా జాషువ, ఎడిటర్‌గా శివ శర్వాణి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హీరో చంటి మాట్లాడుతూ,’నా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ బర్త్‌డే పోస్టర్ని రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటివరకు ఈ తరహా సినిమా రాలేదు. ఆద్యంతం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఇలాంటి ఓ మంచి సినిమాలో నాకు అద్భుతమైన పాత్రను చేసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో కథ, కథనంతోపాటు మా పాత్రలు, సంగీతం, కెమెరా, సంగీతం.. ఇలా ప్రతీదీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అద్భుతంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.
సరికొత్తగా ‘పేట రౌడీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



