15 మంది మావోయిస్టులు హతం..
మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు
సారండా : జార్ఖండ్‌లో సారండా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ మరణించారు. ఆయనపై రూ.5 కోట్లు రివార్డు ఉంది. ఇంకా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాతే వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. చైబాసాలోని కిరీబురు పోలీస్‌స్టేషన్ పరిధిలో సారండా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. సారండా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్, భద్రతా దళాలు కలిసి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారని, ఈ క్రమంలో మావోలు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.
వెంటనే ప్రతిస్పందించిన భద్రతా బలగాలు మావోయిస్టులపై భీకర కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనల్లో మావోయిస్టులకు భారీగానే నష్టం కలిగిందని పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్లో సీనియర్ మావోయిస్టు కమాండర్ హతమైనట్టు తెలిసింది. అతనిపై రూ.50 లక్షల రూపాయల రివార్డు ఉందని సమాచారం. గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగినట్టు కొల్హాన్ డీఐజీ అనురంజన్ తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని మరిన్ని వివరాలను ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. దట్టమైన అడవుల్లో మావోయిస్టులు దాక్కుని ఉన్నారని తెలిపారు. వారిని అంతమొందించడానికి అదనపు బలగాలను కూడా మోహరించినట్టు చెప్పారు. జార్ఖండ్‌ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడానికి అతిపెద్ద అడ్డంకి ఈ సారండా అటవీ ప్రాంతమే భద్రతాబలగాలు పేర్కోంటున్నాయి.
దాదాపు 256 మంది మావోయిస్టులు మృతి!
గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య బస్తర్ డివిజన్లోని వివిధ జిల్లాల జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపు 256 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. దాదాపు 665 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఏకే 47, ఎల్ఎంజీ, ఐఎన్ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్ వంటి ఆటోమెటిక్ ఆయుధాలు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా 303 భర్మార్లు, బీజీఎల్ లాంచర్లు, సింగిల్ షాట్ రైఫిల్స్, కార్బైన్లతో సహా వివిధ రకాల ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిలో కొన్నింటిని ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకోగా, మరికొన్నింటిని అడవి ప్రాంతం నుంచి పునరావాసం పొందిన మావోయిస్టుల నుంచి తీసుకున్నారు.
జార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్
- Advertisement -
- Advertisement -



