బిల్డింగ్ పెయింటింగ్ కార్మికునికి సహాయం అందజేత
నవతెలంగాణ – మిర్యాలగూడ
కార్మికులందరూ సంక్షేమ బోర్డులో సభ్యత్వం కలిగి ఉండాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. ఆదివారం స్థానిక స్థానిక బిల్డింగ్ పెయింటింగ్ అడ్డా వద్ద సుందర్ నగర్ కు చెందిన పెయింటర్ యాట కలమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం బియ్యం నిత్యవసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులందరూ సిఐటియు సభ్యత్వం కలిగి ఉండాలని కోరారు. ఆపద సమయంలో సంఘం ఆదుకుంటుందని చెప్పారు. కార్మికులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి, బి ఎం నాయుడు, యాదగిరి, మంద రాజు,యూనియన్ అధ్యక్షులు పాషా, గోవర్ధన్ రెడ్డి, ఎస్పీ నాయక్, బుచ్చిబాబు, కలమ్మ, వెంకటమ్మ, ఎల్లమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులందరూ సంక్షేమ బోర్డులో సభ్యత్వం కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



