- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో ఆదివారం ఆర్యవైశ్య భవనంలో ఆ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మర్గారి శ్రీనివాస్ చేతుల మీదుగా మండల అధ్యక్షుడు నాగమండి మధుసూదన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శి ఐత వెంకటేష్ , కోశాధికారి కస్తూరి వెంకటేష్ , ఉపాధ్యక్షులుగా జిల్లా శ్రీనివాసులు ,సముద్రాల శ్రీనివాస్ ఆయిల్ మిల్, సహాయ కార్యదర్శిగా నీలం రామన్న ప్రమాణ స్వీకారం చేశారు.
సలహాదారులు కార్యవర్గ సభ్యులు పట్టణ అధ్యక్షులు ఐడియా శ్రీనివాస్, పడకండి సందీప్, సరబ్ సంతోష్ కుమార్, 7వ వార్డ్ బిజెపి కౌన్సిలర్ గా నిలబడుతున్న సముద్రాల కల్పన, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



