- Advertisement -
కాటారం తహసీల్దార్ నాగరాజు
నవతెలంగాణ – కాటారం
ప్రజాస్వామ్య భారతదేశ వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని కాటారం తహసీల్దార్ నాగరాజు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా ఆదివారం మండల కేంద్రం అయినా గారెపల్లి సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించరు. అనంతరం అయన మాట్లాడుతూ.. 18 ఏళ్ళు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కుల, మతాలకు, భాష బేదాలకు అతీతంగా ఎటువంటి వివక్ష లేకుండా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించు కోవాలని ప్రతిజ్ఞ చేయించారు.
- Advertisement -



