Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పులికోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు

పులికోసం గాలింపు చర్యలు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలో ఇటీవల మరణించిన చిరుత పులి కలకలం మరువక ముందే మైబాపూర్ గ్రామాలలో ఇంకో పులి తిరుగుతుందని ఘటన చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్, గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం రాత్రి కొంతమంది రైతులు వ్యవసాయ భూములోని పంటలకు నీరు అందించేందుకు వెళ్తున్న క్రమంలో ఒక పొదల చాటున పెద్ద పెద్ద కళ్ళతో మెరుస్తూ ఒక జంతువు కనిపించిందని గ్రామస్తులకు తెలిపారు. ఈ విషయాన్ని నీరు పెట్టేందుకు వెళ్తున్న రైతులు గ్రామస్తులకు మొబైల్ ఫోన్ ద్వారా విషయాన్ని గ్రామస్తులకు వివరించారు.

అదే రాత్రి అందరూ కలిసి రావడంతో అక్కడ ఉన్న జంతువు పరారైపోయింది. గమనించిన గ్రామస్తులు అది చిరుత పులినా ? ఇంకేదైనా జంతువు ఉందా?,  క్రూర మృగం ఏదైనా ఉందా ? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయం ఫారెస్ట్ అధికారులకు గ్రామ సర్పంచ్ బశ్యవ్వ అశోక్ రెడ్డి సమాచారం తెలియచేశారు. శనివారం ఎఫ్ ఆర్ ఓ సంతోషా, డివై ఎఫ్ఆర్ఓ సుజాత, బీట్ ఆఫీసర్ రాములు  నేతృత్వంలో మై మైబాపూర్ ఆటవి, వ్యవసాయ పర్వత ప్రాంతంలో స్థానిక సర్పంచు,  గ్రామస్తులు , రైతులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ ఎటువంటి చిరుత పులి సంచారం చేసినట్టు ఆనవాళ్లు కనిపించలేదని ఫోన్ ద్వారా మీడియాకు తెలియజేశారు.

అనంతరం మైబాపూర్ గ్రామంలోని గ్రామస్తులతో సమావేశం నిర్వహించి చిరుతపులి వలన జరిగే అనర్థాలను, జాగ్రత్తలను గ్రామస్తులకు అవగాహన పరచడం జరిగింది. రైతులు తప్పకుండా అందరూ కలిసి కట్టుగా వెళ్లాలని, ఒకరిగా వెళ్లకూడదని, అందరు తగు జాగ్రత్తలు పాటించాలని, రాత్రిపూట బయట తిరగవద్దని అవగాహన పరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బశ్యవ్వతో పాటు ఫారెస్ట్ అధికారులు రేంజ్ ఆఫీసర్ సంతోషా, డివైఎఫ్ఆర్ఓ సుజాత , బీట్ ఆఫీసర్ రాములు, గ్రామ యువకులు మహిళలు పెద్దలు నాయకుడు అశోక్ రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -