నవతెలంగాణ – దర్పల్లి
నిజామాబాదు టౌన్ పాస్టర్స్ ఫెలోసిఫ్ తెలంగాణ 33 జిల్లాల క్రైస్తవుల పక్షంగా, అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తూ క్రైస్తవ సమాజ అభ్యునతి కొరకు ఆహార్నిశలు కష్టపడుతున్న గోనే సాల్మన్ రాజుకే కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిజామాబాదు రూరల్ నియోజకవర్గం క్రైస్తవ నాయకులు కోరుతున్నారు. ఈసందర్బంగా ఆదివారం నియోజకవర్గ ఫాదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కార్యక్రమములో ముఖ్యఅతిధిగా రూరల్ ఫాదర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా” చెంగల జోసెఫ్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలు ఈ విషయం పై కులాంకుశంగా పరిశీలించి, సౌమ్యుడు, అందరిని కలుపుకొని వెళ్లే ధైర్యశాలి నాయకుడు గోనే సాల్మన్ రాజుకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. అనుభవంగనుదైనా వేక్తి రాజు కు అందిస్తే రానున్న రోజూల్లో తమ క్రైస్తవ సమాజానికి మేలు చేయడంతోపాటు, పార్టీ ప్రతిష్ట పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమములో అధ్యక్షులు ఎం ఏసురత్నం, దానియెల్, భాస్కర్, ప్రసాద్, మోహన్, భాస్కర్, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.



