- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ బెజ్జారపు రాకేష్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన అందరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటు యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ భలేరావ్ శంకర్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మదుపాల్, గ్రామపంచాయతీ అధికారి, బూతు లెవల్ అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొల్పారు.
- Advertisement -



