Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంతస్థలంలో పెరిగిన కంప చెట్టు తొలగింపు..

సంతస్థలంలో పెరిగిన కంప చెట్టు తొలగింపు..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని కొంపల్లి గ్రామంలోని అంగడి, పశువల సంత ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో  విపరీతంగా కంపచెట్లు పెరగడంతో ఆదివారం కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి  పాలకవర్గం తో కలిసి జెసిబి తో తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఉన్న సౌకర్యాలకు దీటుగా కొంపల్లి గ్రామంలో ఉండే విధంగా గ్రామ ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు ప్రతి వారం అంగడి , సంత నిర్వహిస్తే గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉప్పునూతల  స్వామి, వార్డు సభ్యులు జీడిమడ్ల నరేష్, జాల నర్సింహ, జీడిమడ్ల మౌనిక, సూర శ్రీశైలం, బోయపర్తి ప్రసాద్, సూర సురేష్, గోలి పార్వతి,  భీముడు మల్లేష్, జీడిమడ్ల దశరథ, దాము నర్సింహ, సంకు శంకర్, జీడిమడ్ల సురేష్, మొగుదాల పెంటయ్య, సూర శంకర్, జూకంటి శ్రీశైలం, మొగుదాల యాదయ్య, జీడిమడ్ల వెంకటయ్య, మొగుదాల శేఖర్, ఎడ్ల ఐలయ్య, జాల రాములు, మాదరగోని చంటి, వీరమల్ల అంజయ్య, అన్యాలపు అలివేలు, ఎడ్ల మహేష్, తిరుగుళ్ళ శ్రీను గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -