బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ..
నవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండలం పలివెల గ్రామంలో తెలుగు టీచర్ ని వెంటనే నియమించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి కృష్ణ కోరారు. ఆదివారం పలివెల గ్రామంలో ఆయన మాట్లాడుతూ .. గత సంవత్సరం గత నవంబర్ నుండి తెలుగు టీచర్ లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. మూడు నెలల నుండి విద్యార్థులకు తెలుగు టీచర్ లేకపోవడం తో విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. పదవ తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నందున టీచర్ ను నియమించకుండా జిల్లా, మండల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి టీచర్ను నియమించకపోతే జిల్లా విద్యాశాఖ కార్యాలయమును ముట్టడిస్తామని హెచ్చరించారు.
పలివెలలోతెలుగు టీచర్ ని వెంటనే నియమించాలి
- Advertisement -
- Advertisement -



