Sunday, January 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ లో జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ 

మద్నూర్ లో జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం జుక్కల్ (SC) అసెంబ్లీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయం నుండి జడ్పీ సీఈవో చందర్ , మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపీడీఓ రాణి, నియోజక వర్గంలోనీ బి ఎల్ ఓ లు, బి ఎల్ ఓ సూపర్వైజర్ లు, ఉపాధ్యాయులు , సీనియర్ సిటిజన్స్, విద్యార్థులతో కలిసి ముందు భాగాన సైకిల్ లతో, ర్యాలీనీ గాంధీ చౌక్ వరకు, అక్కడి నుండి రైతు వేదిక వరకు నా భారత్-నా ఓటు నా ఓటు-నా దేశం కోసం అంటూ నినాదిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ సీఈవో చందర్ మాట్లాడుతూ.. ఓటు వజ్రాయుధం లాంటిది అని ఓటు హక్కు ను ప్రతి ఒక పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు వేయాలని అన్నారు. మన ఓటు ద్వారానే గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ వరకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటాం అని తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు గల ప్రతి మనిషి ఓటర్ గా నమోదు చేసుకోవాలని అన్నారు.

గతంలో కంటే ఈ మధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువగా యువత సర్పంచ్ లు అయ్యారని గుర్తు చేశారు. యువతే దేశానికి వెన్నుముక కావున యువతి, యువకులు ఓటర్ గా తప్పులు లేకుండా మంచి  పాస్ ఫోటోతో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, ప్రసంగ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ , ఎంపీడీఓ రాణి, నాయబ్ తహశీల్దార్లు శరత్, భరత్, గిర్దవార్లు శంకర్, శీతల్, అంజయ్య, రెవెన్యూ అధికారులు రవి, శ్రీనివాస్, బాలరాజు, ప్రవీణ్, దశరథ్, జిపిఓ లు సత్యం, దినకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -