- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన కర్రే వార్ పండరి అనే యువకుడు ఆకుపైన అంబేద్కర్ బొమ్మను గీసి అందరిని ఆకర్షించారు. ఈనెల 26న సోమవారం జరుపుకునే గణతంత్ర దినోత్సవం పురస్కరించు కొని ఆకు పై అంబేద్కర్ బొమ్మను గీసినట్లు పండారి పేర్కొన్నారు. ఈ అద్భుత బొమ్మను తిలకించిన స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, పలువురు పండారిని అభినందిస్తున్నారు.
- Advertisement -



