Sunday, May 25, 2025
Homeఖమ్మంపల్లెల్లో వెళ్ళివిరియనున్న ప్రకృతి సాగు…

పల్లెల్లో వెళ్ళివిరియనున్న ప్రకృతి సాగు…

- Advertisement -

కార్యాచరణకు జాతీయ కమీషన్ కసరత్తులు…
నియోజక వర్గంలో 5 గ్రామాలు ఎంపిక…
రైతులను సంసిద్ధం చేస్తున్న ఏడీఏ రవి కుమార్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఆధునికత తారాస్థాయికి చేరినప్పటి కీ ఔషధ ఆధారిత పంటలు సాగు కలుషితం,కలుషిత ఆహారంతో ప్రజలు అనేక రోగాలతో సతమతం అవుతున్న తరుణంలో ప్రకృతి సాగు పెంపుదల పై కేంద్రం దృష్టి సారించింది.ఇందుకోసం జాతీయ కమీషన్ ఏర్పాటు చేసి కార్యాచరణ ను అమలు చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు క్షేత్రస్థాయి అమలు పై నవతెలంగాణ తో పలు అంశాలను పంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయం జాతీయ మిషన్ (నేషనల్ కమీషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్): కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ ను ఏర్పాటు చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పధకంలో భాగంగా ప్రకృతి వ్యవసాయ జాతీయ మిషన్ పధకం అమలుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పధకం అమలుకు ప్రతి మండలంలో ఒక క్లస్టర్ గ్రామాన్ని ఎంపిక చేయటం జరిగింది.గుర్తించిన గ్రామం లేదా గుర్తించిన గ్రామ సముదాయం లో ఔత్సాహిక రైతులను ఎంపిక చేయటం జరుగుతుంది. ఇందులో మొత్తం 125 మంది రైతులను గుర్తించి వారి వ్యవసాయ కమతంలో మొదటగా ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్దతి ఆచరిస్తారు. ప్రకృతి వ్యవసాయం పై జాతీయ మిషన్ నేపధ్యం: వాతావరణంలో వస్తున్న మార్పులు,పంటలకు ఆశిస్తున్న చీడపీడల ఉదృతి, క్షీణిస్తున్న నీటి లభ్యత,పంట ఉత్పత్తులలో తగ్గుదల చివరిగా రైతు ఆదాయంలో తగ్గుదల నేపధ్యం. ప్రస్తుతం ఆచరిస్తున్న వ్యవసాయ పద్దతులు నుండి క్రమంగా ప్రకృతి వ్యవసాయ పద్దతి కి మారటం: మొదటి సంవత్సరంలో…. ఎంపిక చేసిన రైతులకు శిక్షణ,క్షేత్ర సందర్శన, ఇంటి పెరట్లో ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయల సాగు తో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించడం. రెండవ మరియు మూడవ సంవత్సరం….పశువుల పేడ,మూత్రం సేకరణ  జీవామృతం వంటి బయో ఉత్పత్తుల తయారీ  మల్చింగ్,అంతర పంటల సాగు పద్దతులను అవలంభించడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పై అవగాహన,నమ్మకం ఏర్పడి రైతు తన క్షేత్రంలో కొంత విస్తీర్ణంలో నమూనా సాగు మొదలు పెట్టటం. నాలుగవ,అయిదవ సంవత్సరం…
ప్రకృతి వ్యవసాయ పద్దతులను రైతు తన మొత్తం వ్యవసాయ క్షేత్రంలో ఆచరించటం.
 ప్రకృతి వ్యవసాయంలో పంచ సూత్రాలు:
1.భీజామృతం తో విత్తన శుద్ధి 
2.నేల ఆరోగ్య యజమాన్యం 
3.సంవత్సరం మొత్తం నేలను కప్పి ఉంచేలా పంటల తో లేదా పంట వ్యర్థాలు తో భూమి ఆచ్చాదన 
4.నేల సూక్ష్మ వాతావరణం యజమాన్యం 
5.పంటల ఆరోగ్య యాజమాన్యం 
ప్రకృతి వ్యవసాయంలో రైతులు సామూహికంగా ఆచరించవలసిన నవ పద్దతులు:
1.నేలలో సేంద్రియ పదార్ధాన్ని వృద్ధి చేయటం 
2.నేలను దున్న కుండా లేదా కనీస స్థాయిలో దున్నడం ద్వారా పంటల సాగు 
3.వైవిధ్యమైన పంటల సాగు 
4.సంవత్సరంలో 365 రోజులు భూమిని కప్పి వుంచటం 
5.పశు పోషణను పంటల సాగు తో మిళితం చేయటం 
6.ప్రకృతి పద్దతులతో చీడపీడల యాజమాన్యం 
7.కృత్రిమ రసాయనాలను వాడక నిషేధం.
8.క్షేత్రంలోనే తయారు చేసిన సహజ బయో ఉత్పత్తుల వాడకం 
9.స్థానికంగా రూపొంది స్థానిక వాతావరణానికి తగిన పంట విత్తనాలను వాడటం 
అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్ లో ప్రకృతి వ్యవసాయ జాతీయ మిషన్అ మలులో భాగంగా ప్రతి మండలంలో ఒక క్లస్టర్ గ్రామాన్ని గుర్తించటం జరిగింది. అశ్వారావుపేట మండలంలో మల్లాయిగూడెం,చండ్రుగొండ లో బెండాలపాడు,దమ్మపేట లో మందలపల్లి అన్నపురెడ్డిపల్లి లో నర్సాపురం, ములకలపల్లి లో మూక మామిడి గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ క్లస్టర్ గ్రామాలలో 125 మంది రైతుల క్షేత్రాలలో మట్టి నమూనాలు సేకరించి పోషకాలు విశ్లేషణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్,ఉద్యాన అధికారి వేణు,వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు పావని,  కోటేశ్వర రావు,వ్యవసాయ విస్తరణ అధికారులు రవీందర్ రావు,షకీరా భాను,సతీష్, రైతులు ప్రసాద్,మొడియం మణెమ్మ, రాములమ్మ వాసన్ స్వచ్చంద సంస్థ ప్రతినిధులు చక్రపాణి,శ్రీనివాస రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -