నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్, హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ తన కెరీర్‌లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో టీ20 ఫార్మాట్‌లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఘనత సాధించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో కెప్టెన్ అజింక్యా రహానెను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సిరాజ్ విసిరిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు రహానె (14) డిఫెన్స్ ఛేదించుకుని బంతి వికెట్లను గిరాటేసింది. ఈ వికెట్‌తో టీ20ల్లో 200 వికెట్లు పడగొట్టిన 21వ భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. తన 174వ టీ20 మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్న సిరాజ్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 121 మ్యాచ్‌లలో 123 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌లో సిరాజ్ అరుదైన ఘనత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



