Friday, July 17, 2026
E-PAPER
Homeజాతీయంబద్రీనాథ్ విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

బద్రీనాథ్ విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

- Advertisement -

నవతెలంగా-హైదరాబాద్: బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం టెంపుల్ మాజీ అధికారి రాజేందర్ చౌహాన్ ను అధికారులు అరెస్ట్ చేశారు. విరాళాల చోరీపై సుదీర్ఘంగా రాజేందర్ ను సిట్ అధికారులు విచారించారు. ఈ తర్వాత ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. శనివారం రాజేందర్ ను న్యాయస్థానంలో హాజరపర్చనున్నారు.బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీలో చౌహాన్ కీలక పాత్ర వహించారు. జూన్ 22, 25, 29 తేదీలలో చౌహాన్ నగదు కట్టలను తీసుకుని తన జేబులో పెట్టుకోవడం ఆ ఫుటేజీలో స్పష్టంగా కన్పించింది. దీనితో ఎస్‌ఐటీ (SIT) ఆయనను విచారణకు పిలిపించింది. ఎస్‌ఐటీ ఆ ఫుటేజీని, ఇతర ఆధారాలను పరిశీలించింది. తాజాగా రాజేందర్ ను అరెస్ట్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -