నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు జీపి గ్రామమైన చండేగావ్ లో గ్రామ సర్పంచ్ బి. లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిపి కార్యవర్గ సభ్యులు గ్రామస్తులతో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ఉపధ్యాయులు సమయాలనుకూలంగా వస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నామన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించామని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకు నిత్యం భోజనము మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, జిపి కార్యదర్శి, జిపి కార్యవర్గ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



