నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మార్కెట్ కమిటీ కార్యాలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. రూ.30 లక్షల మార్కెట్ కమిటీ నిధులతో మార్కెట్ కమిటీ కార్యాలయ మొదటి అంతస్తు లో మీటింగ్ హాల్, చైర్మన్ చాంబర్, నిర్మాణం కోసం మంజూరైన నిధులతో వాటి నిర్మాణం కోసం ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సోమవారం శంకుస్థాపన చేస్తూ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, స్థానిక సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి, మార్కెట్ కమిటీ ఇన్చార్జి సెక్రెటరీ, మార్కెట్ కమిటీ సూపర్వైజర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ కార్యాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి: ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



