Wednesday, January 28, 2026
E-PAPER
Homeసినిమాఅందరినీ ఎంటర్‌టైన్‌ చేసే సినిమా

అందరినీ ఎంటర్‌టైన్‌ చేసే సినిమా

- Advertisement -

తరుణ్‌ భాస్కర్‌ లీడ్‌రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా హీరోయిన్‌. ఏఆర్‌ సజీవ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ ఒరిజినల్స్‌, మూవీ వెర్స్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌ పై సజన్‌ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్‌ కష్ణని, అనుప్‌ చంద్రశేఖరన్‌, సాధిక్‌ షేక్‌, నవీన్‌ సనివరపు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కిషోర్‌ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 30న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్‌ ఈషా రెబ్బా మాట్లాడుతూ, ‘నన్ను ఈ క్యారెక్టర్‌లో బిలీవ్‌ చేసినందుకు సజీవ్‌కి థ్యాంక్యూ. సజీవ్‌ ఈ సినిమా డిజైన్‌ని అద్భుతంగా చేశారు. ఇందులో చాలా మీనింగ్‌ ఫుల్‌ మ్యూజిక్‌’ అని అన్నారు.
‘ఈ సినిమాకి చాలా మంది హీరోలు ఉన్నారు. ఈ సినిమాని అందరూ రీమేక్‌ అంటున్నారు. కానీ ఈ కథని ఒరిజినల్‌గా ప్రజెంట్‌ చేయడానికి నిదర్శనమే ఆ పాట. జై క్రిష్‌ వజ్రం లాంటి సాంగ్‌ ఇచ్చాడు. ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్‌ చేస్తుందని నమ్మకం’ అని హీరో తరుణ్‌ భాస్కర్‌ చెప్పారు. డైరెక్టర్‌ సజీవ్‌ మాట్లాడుతూ, ‘సజన్‌ కథల ఎంపిక చాలా నిజాయితీగా ఉంటుంది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన ఆయనకి థ్యాంక్స్‌. సినిమా చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. జై క్రిష్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఈ సినిమాలో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోతుంది. ఈ సినిమాకి సూపర్‌ స్టార్‌ ఈషా. శాంతి పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుంది. తరుణ్‌ భాస్కర్‌ నా లైఫ్‌లో హీరో. ఆయన్ని డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను. ఆయన ఓంకార్‌ నాయుడు పాత్రలో గుర్తుండిపోతారు’ అని అన్నారు.
ప్రొడ్యూసర్‌ సజన్‌ మాట్లాడుతూ,’ఇది రీమేక్‌ అని మేమే చెప్పాము. రీమేక్‌ అంటే మనం చూసిన కథని ఇంకొక లాగా చెప్పడం. రామాయణం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా కథ అదే. కానీ ఒక్కొక్క కోణంలో ఒక్కోలా కనిపిస్తుంది. ఈ సినిమా కూడా ఇంటింటా రామాయణం. ఎన్నిసార్లు చూడాలనుకున్నా మళ్లీ చూడొచ్చని నమ్మి చేసిన సినిమా’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -