Wednesday, January 28, 2026
E-PAPER
Homeసినిమాఅందరూ మెచ్చే 'దేవగుడి'

అందరూ మెచ్చే ‘దేవగుడి’

- Advertisement -

పుష్యమి ఫిలిం మేకర్స్‌ బ్యానర్‌ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘దేవగుడి’.
ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది.
ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాత బెల్లం రామకష్ణారెడ్డి మాట్లాడుతూ, ”దశ్యకావ్యం’ తరువాత నేను దర్శ కత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల రిలీజ్‌ చేసిన మా మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చిత్ర పాడిన ‘ఆరో ఆరారో’ పాటకు పెద్ద సంఖ్యలో వ్యూస్‌ వస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్‌ అవుతున్న మూవీస్‌లో మా చిత్రానికే డిజిటల్‌ వ్యూస్‌ ఎక్కువగా ఉన్నాయి. సినిమాకు సెన్సార్‌ నుంచి మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. నేనే దర్శకుడిని, నిర్మాతను కావడం వల్ల అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించ గలిగాను. సురేష్‌ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం. ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్‌ కోసం మంచి డిమాండ్‌ ఉంది. ట్రైలర్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచి బిజినెస్‌ పరంగా మంచి ఎంక్వైరీస్‌ వస్తున్నాయి’ అని తెలిపారు.
నటుడు రఘుకుంచె మాట్లాడుతూ,’నేను వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆయన ఆ చుట్టు పక్కల ఏరియాలో పవర్‌ ఫుల్‌ వ్యక్తి. నాకు ‘పలాస’ సినిమా తర్వాత అలాంటి రోల్స్‌ వస్తున్నాయి. ఈ సినిమాలో వీరారెడ్డి పాత్ర కోసం దర్శకుడు రామకష్ణా రెడ్డి ఎలా చెబితే అలా పర్‌ఫార్మ్‌ చేశాను. రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెప్పాను. స్నేహం, ప్రేమ, పగ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ మూవీ ఆకట్టుకునేలా సాగుతుంది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -