- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మేడ్చల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మల్లారెడ్డి ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం తండాలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులతో కలిసి ఆయన ఉత్సాహంగా స్టెప్పులేసి సందడి చేశారు. తనదైన శైలితో అందరిలో ఉత్సాహాన్ని నింపారు.
- Advertisement -



