Thursday, May 21, 2026
E-PAPER
Homeఆటలుగిల్‌, సాయి సుద‌ర్శ‌న్, బ‌ట్ల‌ర్ అర్ధ సెంచ‌రీ..సీఎస్కే టార్గెట్ ఎంతంటే..?

గిల్‌, సాయి సుద‌ర్శ‌న్, బ‌ట్ల‌ర్ అర్ధ సెంచ‌రీ..సీఎస్కే టార్గెట్ ఎంతంటే..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవ‌ర్ల‌కు గాను 4 వికెట్లు కోల్పోయి 229ప‌రుగులు చేసింది. జీటీ బ్యాట‌ర్లు గిల్‌, సాయి సుద‌ర్శ‌న్, బ‌ట్ల‌ర్‌ అర్ధ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ముందుగా టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన గుజ‌రాత్ బ్యాట‌ర్లు దుమ్మురేపారు. ఏడు ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 84 ప‌రుగుల‌తో సాయి సుద‌ర్శ‌న్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. సుభ‌మ‌న్ గిల్ 64 ప‌రుగుల‌తో అమూల‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. చివ‌ర్లో బ‌ట్ల‌ర్(57) ధ‌నాధ‌న్ ఆట‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. 24 బంతుల్లో అర్ధ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఐదు ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో చెన్నై బౌల‌ర్ల‌ను ఆడుకున్నాడు. చెన్నై బౌల‌ర్లు జాన్‌, కాంబోజ్, చౌద‌రి త‌లా ఒక వికెట్ తీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -