Friday, January 30, 2026
E-PAPER
Homeజాతీయంకన్నీటి వీడ్కోలు

కన్నీటి వీడ్కోలు

- Advertisement -

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కడసారి చూపునకు తరలివచ్చిన జనం
నివాళ్లు అర్పించిన ప్రధాని, కేంద్రహౌంమంత్రి, పలువురు రాజకీయ నేతలు
విమానప్రమాదంలో బ్లాక్‌ బాక్స్‌ లభ్యం


ముంబయి : మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిండే తదితర రాజకీయ ప్రముఖులు అంతక్రియల్లో పాల్గొన్నారు. అజిత్‌? పవార్‌?ను కడసారి చూసేందుకు ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున మైదానానికి వచ్చి పార్టీ అధినేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.

ప్రమాదంలో బ్లాక్‌బాక్స్‌ లభ్యం
బారామతిలో బుధవారం ప్రమాదానికి గురైన లియర్‌జెట్‌-45 విమానానికి చెందిన బ్లాక్‌ బాక్స్‌ లభించింది. ఈ ప్రమాదంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. బ్లాక్‌ బాక్స్‌ లభించిందని, విచారణ వేగవంతంగా జరుగుతోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. లోతుగా, పారదర్శకంగా దర్యాప్తు జరపడానికే ప్రాధాన్యత ఇస్తామని, దర్యాప్తును పూర్తి చేయడానికి గడువు కూడా విధిస్తామని చెప్పింది.

విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) డైరెక్టర్‌ జనరల్‌, మరో ముగ్గురు అధికారులు బారామతి చేరుకొని విచారణ ప్రారంభించారు. ముంబయిలోని పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌ ప్రాంతీయ కార్యాలయం నుంచి ముగ్గురు అధికారులతో కూడిన మరో బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. బ్లాక్‌ బాక్స్‌లో ఫ్లయిట్‌ డేటా రికార్డర్‌, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ ఉంటాయి. విమాన ప్రమాదానికి కారణమేమిటో తెలుసుకునేందుకు దీనిని విశ్లేషిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -