ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
నెల్లికుదురు ఎంపీడీవో సింగారం కుమార్ ఉత్తమ ఎంపీడీవో గా కలెక్టర్ చేతుల మీదుగా అందుకోవడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించి శాలువాతో ఘనంగా శుక్రవారం సన్మానించి స్వీట్లు పంచుకునే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీడీవో కుమార్ మండలంలోని అన్ని శాఖలను కలుపుకొని మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నందున ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అంతే కాకుండా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా శాంతి యుతంగా ఎన్నికల నిర్వహించుకునేందుకు కృషి చేసిన ఎంపీడీవో సేవలను గుర్తించి జిల్లా ఉత్తమ ఎంపీడీవో అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి ఎంపీడీవోను శాలువాతో ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. వారు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సహకరిస్తారని తెలిపారు. వీరి వెంట గుదే యుగేందర్ తో పాటు కొంతమంది ఉన్నారు.
ఎంపీడీవో కుమార్ కు ఉత్తమ అవార్డు పట్ల హర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



