- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ పరిధిలో దారుణం జరిగింది. న్యాయవాదిని దుండగులు కారుతో ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం న్యాయవాది మొహినుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి కారులో బయల్దేరుతున్న క్రమంలో.. వెనుక నుంచి వచ్చి మరో కారుతో ఢీకొట్టారు. దీంతో మొయినుద్దీన్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
- Advertisement -



