– టెంపుల్ సిటీ లో వేద పాఠశాలకు శంకుస్థాపన
– అనంతరం నరసింహున్ని దర్శించుకున్న సీఎం
నవతెలంగాణ – యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్టలో పర్యటించారు. ఉదయం 8:50 నిమిషాలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎంరేవంత్ రెడ్డికి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కి ప్రభుత్వ విప్ ఆలేర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నేరుగా టెంపుల్ సిటీలో 43 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వేద పాఠశాల పనులకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి సీఎం భూమి పూజ నిర్వహించారు.

100 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన అక్కడే శంకుస్థాపన చేశారు. అనంతరం యాదగిరి కొండపైకి చేరుకున్న సీఎంకి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వయంభులను దర్శనం చేసుకున్న అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేపట్టారు. దేవస్థానం ఈవో భవాని ప్రసాద్ ధర్మకర్త నర్సింహమూర్తిలు సీఎంకి మంత్రులకు స్వామి వారి జ్ఞాపికను ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరంలో సీఎం హైదరాబాద్ కు వెళ్లారు.






