Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా మాజీ ఎమ్మెల్యే

కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-గీసుకొండ : గీసుకొండ మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అక్తర్ పాషా తండ్రి యాకుబ్ ఇటీవల మృతిచెందగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శనివారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యాకుబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు  మ్మగడ్డ వెంకన్న, మండల బీఆర్ఎస్ నాయకులు పోలీస్ ధర్మారావు, ముంత రాజయ్య యాదవ్, బోడకుంట్ల ప్రకాష్, రఘు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొంగర రవి, కార్యదర్శి కందగట్ల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కొంగర చంద్రమౌళి, కొంగర స్వామి, కొంగర సుదర్శన్, యూత్ నాయకులు శిరీష శ్రీకాంత్, ఎండీ అజార్, గాలి అన్వేష్, కొంగర ప్రభాకర్ తదితర కార్యకర్తలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -