నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరును కరువు మండలంగా ప్రకటించాలని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ అన్నారు. ఆలేర్ పట్టణంలో శుక్రవారం సిపిఐ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశాన్ని గిరిబోయిన స్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల దేశంలోని ఎల్లీనో ప్రభావం చేత వాతావరణ మార్పులతో వర్షాలు పడకపోవడంతో, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ఆలేరును కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
వర్షాలు పడకపోవడంతోటి గ్రౌండ్ వాటర్ ఇంకిపోవడంతోటి కరెంటు సక్రమంగా రాక పెట్టినటువంటి పంటలు పారక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గంధమళ్ల చెరువును, రిజర్వాయర్ను చేసి దాని ద్వారా ఆలేరు ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే ఆలేరు ని కలెక్టర్ సందర్శించి కరువును అంచనా వేసి, రైతులకు కరువు భత్యాన్ని ప్రకటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చౌడబోయిన పరుశురాములు, మండల సహాయ కార్యదర్శి పొన్నబోయిన రవి, ఆలేరు మండల కార్యవర్గ సభ్యులు కందుల మధు, ఏఐవైఎఫ్ మండల కన్వీనర్ బర్ల ప్రశాంత్, జహంగీర్ బి, దార ఉదయ తదితరులు పాల్గొన్నారు.



