నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 57వ ఎన్ఎస్ఎస్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చైర్మన్ ప్రొఫెసర్ జె.రాజా రామ్ మాట్లాడుతూ.. ఎన్ఎస్ ఎస్ వాలంటీర్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీ స్వచ్ఛభారత్ డ్రగ్స్ అవేర్నెస్ ఎయిడ్స్ అవేర్నేస్ లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించుకోవాలని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నల్లబొలు ముత్యాలు మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ డే ఆవిర్భావం గురించి ఇంటిగ్రేషన్ క్యాంపు స్పెషల్ క్యాంపు రెగ్యులర్ యాక్టివిటీస్ గురించి వివరంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇన్ మల్లేశం, ఐక్య సి కోఆర్డినేటర్ ఎన్ సి సౌజన్య, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్, బి రవీందర్, కళాశాల అధ్యాపకులు ప్రొఫెసర్ భారతి, నందకుమార్, వెంకటేశ్వర్లు, జానయ్య, జ్యోతి, చైతన్య, అనిత, లక్ష్మి, ఉపేంద్ర, నాన్ టీచింగ్ సిబ్బంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.



