- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో నాలుగో నిందితుడైన అబ్దుల్ బారి (50) చర్లపల్లి జైల్లో గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఛాతి నొప్పితో బాధపడుతున్న బారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. 2018 నాటి ప్రణయ్ హత్య కేసులో సుపారీ కిల్లర్‌ను ఏర్పాటు చేసిన బారికి నల్గొండ కోర్టు జీవిత ఖైదు విధించింది.
- Advertisement -



