ఐదుగురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-మిడ్జిల్
ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొని ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని రాణిపేట సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
షాద్‌నగర్ పట్టణానికి చెందిన కుమారు, మల్లయ్య, జంగయ్య, రాజు మిడ్జిల్ మండలంలోని వస్పుల గ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా హైదరాబాద్‌కు వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రాణిపేట్ రహదారిపై ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



