నవతెలంగాణ-కొండాపూర్
కొండాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను తహసీల్దార్ అశోక్, జీపీఓతో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని విద్యార్థుల వసతి సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రత, భోజన వసతులు, నివాస గదులు, వాష్‌రూమ్‌లను పరిశీలించారు. హాస్టల్ ప్రాంగణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు మంచి నిర్వహణలో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించి బాగుందని తెలిపారు. అలాగే విద్యార్థులు నివసించే గదులను పరిశీలించగా అవి కూడా మంచి స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉండటంతో హాస్టల్లో పారిశుద్ధ్య నిర్వహణ సంతృప్తికరంగా ఉందని తహసీల్దార్ అశోక్ పేర్కొన్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, భోజనం, పరిశుభ్రతపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.


