Homeతాజా వార్తలు22ఏ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

22ఏ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలోని వేలాది మంది ఆస్తిదారులు, ప్లాట్లు మరియు ఫ్లాట్ల కొనుగోలుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన ఊరటనిచ్చింది. జీహెచ్‌ఎంసీ , హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి చట్టబద్ధమైన ప్లానింగ్ అథారిటీల నుండి అనుమతులు పొందిన లేఅవుట్లు లేదా భవనాలు, సాంకేతిక లోపాలు లేదా రెవెన్యూ వర్గీకరణల వల్ల రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా) పరిధిలో ఉన్నప్పటికీ, వాటి రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ ఆదేశాలను తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు వీలుగా ఒక ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -