Homeతాజా వార్తలురేపు ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం..ట్రాఫిక్ ఆంక్షలు

రేపు ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం..ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రేపు ఖైరతాబాద్ గణేశుని నిమజ్జన నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలవుతాయి.

ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్ మార్గ్/నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అయితే.. విగ్రహాలను తరలించే వాహనాలకు మాత్రమే ప్రధాన ఊరేగింపు మార్గంలో అనుమతి ఉంటుందని.. మిగతా వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

కాగా.. నారాయణగూడ, ఆర్టీసీ ఎక్స్ రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు పోలీసులకు సహకరించాలని వారు కోరారు.

రేపు ఉదయం పూజ అనంతరం ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర మొదలవుతుంది. ఉదయం 6 గంటలకు గణేశ్ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా.. లుంబినీ పార్క్ పక్కన ఉన్న ఎన్టీఆర్ మార్గ్ మీదుగా గణేశ్ విగ్రహాన్ని తరలిస్తారు. అనంతరం హుస్సేన్‌సాగర్‌లో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -