Saturday, August 15, 2026
E-PAPER
Homeఆటలుస్పిన్నర్లతోనే 
తొలి టెస్ట్‌‌కు టీమిండియా

స్పిన్నర్లతోనే 
తొలి టెస్ట్‌‌కు టీమిండియా

- Advertisement -

ముగ్గురు లెఫ్టార్మ్‌ స్పిన్నర్లతో బరిలోకి భారత్‌..
ఉదయం 9 గంటల నుంచి

గాలే: భారత్-శ్రీలంక జట్ల మధ్య గాలే ఇంటర్నేషనల్‌ ‌స్టేడియంలో తొలి టెస్ట్‌ ‌శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు టీమిండియా బౌలింగ్‌ ‌కోచ్‌ ‌మోర్నీ మోర్కెల్‌ ‌తెలిపాడు. తొలి రోజు నుంచే బంతి తిరగడం మొదలవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోర్కెల్‌ ‌తెలిపాడు. దీంతో తొలి టెస్టు కోసం బరిలోకి దిగే తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారేనని ఉత్కంఠ అందరిలో నెలకొంది. ముగ్గురు స్పిన్నర్లు ఆడతారని అదీనూ ఎడమచేతివాటం బౌలర్లతోనేనని భారత బౌలింగ్‌ కోచ్ పరోక్షంగా సమాధానం ఇచ్చాడు. దీంతో కుల్దీప్‌, జడేజాకి తోడు మానవ్‌ ‌సూతార్‌‌లకు తొలి టెస్ట్‌‌లో చోటు దక్కడం ఖాయంగా కనబడుతోంది. జడేజా నిలకడగా లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేయగలడని, కెప్టెన్ గిల్ వారందరినీ ఎలా వినియోగించుకుంటాడనేది చూడాల్సి ఉందని మోర్కెల్‌ ‌తెలిపాడు. ఈ పిచ్‌‌పై బ్యాటింగ్‌ చేయడం సవాలే. అలాగే బౌలింగ్‌ ఎవరితో ఎప్పుడు వేయించాలనే నిర్ణయం కూడా కీలకమే. మేం అన్ని సవాళ్లకు సిద్ధంగా ఉన్నాం.

ప్రసిద్ధ్ కృష్ణపై ప్రశంసల జల్లు..
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకున్నా.. పేస్‌ బౌలింగ్ యూనిట్ పై పూర్తి నమ్మకం ఉందని కెప్టెన్‌ గిల్ చెప్పాడు. గుర్నూర్ బ్రార్ మంచి పేస్ తో పాత బాల్ ను బౌన్స్ చేయగలడు. ప్రసిద్ధ్ కృష్ణ ఇటీవలికాలంలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం భారతజట్టు తరఫున ఉత్తమ ఫామ్ లో అతడు ఉన్నాడు. బుమ్రా లేకపోవడం ఇతర పేసర్లకు తమ సత్తా చాటుకునేందుకు ఒక మంచి అవకాశం. తొలి రెండు రోజుల్లో వికెట్ నుంచి ఎక్కువ సపోర్ట్ లేకపోయినా ఫీల్డింగ్ వ్యూహాలతో ఒత్తిడి పెంచి వికెట్లు తీయాలి” అని పేర్కొన్నాడు. ఇక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ప్రాక్టీస్‌ ‌మ్యాచ్‌‌లో సెంచరీతో రాణించాడు. కాబట్టి మిడిలార్డర్‌‌లో జట్టు బాధ్యతలను అతడు మోయగలడని వివరించాడు.

జట్లు(అంచనా)…
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, పంత్(వికెట్‌ ‌కీపర్‌), జురెల్, జడేజా, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, కుల్‌దీప్‌, సిరాజ్.
శ్రీలంక: ధనుంజయ(కెప్టెన్‌), డిక్వెల్లా(వికెట్‌ ‌కీపర్‌), మధుశంక, లాహిరు, ఛండీమాల్‌, కమిందు, సూర్యభండార, రమేశ్‌ ‌మెండీస్‌, ప్రభాత్‌ ‌జయసూరియ, ఫెర్నాండో, మధుశంక/లాహిరు కుమార.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -