- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆగస్టు 31న విమానం మరుగుదొడ్డిలో ‘బాంబ్’ అని రాసిన టిష్యూ పేపర్ కనిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. భద్రతా తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. తాజాగా బెదిరింపు నోట్‌పై జరిపిన చేతిరాత పరీక్షలో ఓ సిబ్బంది అనుమానితుడిగా మారడంతో దర్యాప్తు సంస్థలు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.
- Advertisement -



